నేటి సాక్షి:నంద్యాల జిల్లా పాములపాడు మండలం గత ప్రభుత్వ పాపం… రైతులకు శాపం…! ప్రైవేటు వ్యక్తుల చేతిలో మార్కెట్ యార్డు గోదాములు అక్కరకు రాని బహుళ ప్రయోజన గోడౌన్లు ఆర్ బి కేల పరిధిలో గోదాములంటూ గతంలో హడావుడి అయినకాడికి పంటను అమ్ముకుని నష్టపోతున్న రైతులు గత ప్రభుత్వం చేపట్టింది.గోదాములు ఉన్నప్పటికీ, 500, 600ల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అదనంగా గోడౌన్ లు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పారిశ్రామిక వస్తువులను వర్షం, తేమ, పురుగుల నుండి రక్షించే విధంగా రూపొందించబడతాయి.గోదాముల ఉపయోగాలురైతులు పండించిన పంటలను భద్రంగా నిల్వ చేయడానికి వినియోగించాలి. పరిశ్రమలు ఉత్పత్తి చేసిన సరుకులను మార్కెట్లో పంపిణీ చేయడానికి ముందు నిల్వ చేయడానికి ఉపయోగిస్తాయి. అయితే చాలా వరకు నిర్మాణాలను అసంపూర్తిగానే వదిలేసింది. ప్రకృతి విపత్తుల సమయంలో చేతికొచ్చిన పైరును నిల్వ చేసుకునే వెసులుబాటు అయినకాడికి అమ్ముకోవాల్సిన దీనస్థితిని గతంలో ఎదుర్కొన్నారు… గోదాములు పూర్తిగా శిధిల వ్యవస్థకు చేరుకుంటున్నాయి. ఊరు బయట ఏర్పాటు చేసిన గోదాములకు కొన్నిచోట్ల రహదారి కూడా లేని పరిస్థితి గ్రామంలో అక్కడక్కడ కనిపిస్తుంది. వర్షాలకు గోదాము యార్డు చుట్టూ నీరు చుట్టేసింది. మండలంలోని ఇస్కాల గ్రామంలో రైతులు వర్షానికి మార్కెట్ యార్డ్ గోదాములో మాసులు నిల్వ ఉంచుకోవడానికి చుట్టూ వర్షపు నీరు చేరడంతో ఉపయోగించుకోలేకపోతున్నారు. కొంతమంది రైతులు రోడ్డుపై ఆర వేసుకున్న తార్పాలిన్ పట్టాలతో తప్పు చేస్తున్నారు. ప్రస్తుతం దానిని చక్కదిద్దే గోదాములకు మండలంలో ప్రతి గ్రామంలో అనుమతులు మంజూరు చేసి పూర్తి చేశారు. కూటమి పాలకులు ఉన్నప్పటికీ ఐదేళ్ల అలసత్వం తాలుకా ప్రభావం ఇప్పటికీ అన్నదాతలపై పడుతూనే ఉంది. తాజాగా తుపాన్ హెచ్చరికలతో దాన్యం రైతులు పంటను నిల్వ చేసుకోవడానికి పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నిల్వ కోసం ప్రైవేటు గోదాములపైనే ఆధారపడిన వారు కొందరైతే ఆ ధర భరించలేని వారు తమ పంటను అయినకాడికి అమ్ముకుని తీవ్రంగా నష్ట పోతున్నారు. అస్తవ్యస్తమయిన గోదాముల వ్యవస్థను గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం నడుంబిగించింది.పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి నిర్మించిన గోదాములు అన్నదాతలకు అక్కరకు రాకుండాపోయాయి. పూర్తి అయిన గోదాములను అన్నదాతలకు అందుబాటులోకి తేవడంలో గత ప్రభుత్వం పూర్తి చేసినప్పటికీ రైతులు ఉపయోగించకపోవడంతో గోదాముల చుట్టూ ఇప్పుడు పిచ్చిమొక్కలకు ఆవాసాలుగా మారి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. నీరుపయోగకరంగా నిర్మించిన గోదాములు ఇప్పటికే లక్షల రూపాయల ప్రజాధనం నీటిపాలైంది. బహుళ ప్రయోజన సౌకర్య గోదాముల పేరిట గత వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లకు గోదాములు ఉన్నప్పటికీ, 500, 600ల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అదనంగా గోడౌన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల కాంట్రాక్టర్లకే మేలు జరిగిందని, రైతులకు ఒరిగిందేమీ లేదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో అనువుకాని చోట నిబంధనలకు విరుద్ధంగా గోదాములు నిర్మించడం వల్ల ఏం ప్రయోజనమని మండలంలోని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మండలంలో అంతటా రహదారులు లేని చోట వాటిని నిర్మించడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.ఇదీ పరిస్థితి..గ్రామాలలో దాదాపు అన్నింటికీ గోదాములు ఉన్నాయి. అయినప్పటికీ గత ప్రభుత్వం బహుళ ప్రయోజన సౌకర్యం పేరుతో ప్రతి పీఏసీఎస్ పరిధిలోని గోదాములు నిర్మాణానికి చర్యలు చేపట్టింది. రహదారులు లేని చోట్ల …పీఏసీఎస్‌లకు అందుబాటులో ఉండేలా గోదాములు నిర్మించడం వల్ల రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఎరువులు, విత్తనాలు తదితర వాటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాతావరణ ప్రతికూల పరిస్థితులు, మార్కెటింగ్ అనుకూలంగా లేని సమయంలో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా గోదాముల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఆ దిశగా పనులు చేపట్టలేదు. వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులను తదితర వాటిని రవాణా చేసేందుకు వీలు లేని చోట… రహదారులు లేని ప్రాంతాల్లో వాటి నిర్మాణం చేపడుతున్నారు. ఇలా చేపట్టవద్దని మండలంలో పలు గ్రామాలలో అప్పుడు వ్యతిరేకత వచ్చినప్పటికీ పట్టించుకున్న వారే కరువయ్యారు. ప్రభుత్వం రైతుల కోసం కోట్ల రూపాయల వ్యయంతో గోదాములను నిర్మించినప్పటికీ, కొన్ని ప్రదేశాలలో అవి సమర్థవంతంగా ఉపయోగించబడటం లేదు కావున అధికారులు గోదాములకు రహదారులు ఏర్పాటు చేసి, గోదాముల చుట్టూ నీరు చేరకుండా చూడాలని రైతులు కోరుకుంటున్నారు.





