Saturday, March 14, 2026

పత్తి రైతులకు అవగాహన సదస్సు.

నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 23, పత్తి కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన పత్తిని తీసుకుని వచ్చి సరైన మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం నిడుగుర్తి రైతు వేదిక లో పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రైతులు పత్తిని ఎండబెట్టి తేమ 8 నుండి 12 శాతం మధ్యలో ఉన్న పత్తిని తీసుకొని వెళ్ళాలన్నారు. అత్యధికంగా 8 శాతం తేమ ఉంటే రూ.8110 కు అంతకుమించి పెరిగే ఒక్కొక్క శాతానికి 81 రూపాయలు ధర తగ్గుతుందన్నారు. అలాగే ఏఈఓ లాగిన్ లో మొబైల్ నెంబరు అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. రైతుబంధు లాగిన్ లో రైతు మొబైల్ నెంబరు ఒకటే డైరెక్ట్ గా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చనీ, రైతులకు అమ్మకాలు సులభతరం అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు.ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. సదస్సులో వరి కొనుగోలు గురించి కూడా అవగాహన కల్పించారు జరిగింది. ఈ సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, మండల తహాసిల్దార్ చింత రవి, , మండల వ్యవసాయ అధికారి గణేష్ రెడ్డి , ఎంపీడీవో,వ్యవసాయ విస్తరణ అధికారి ప్రశాంతి, రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News