( నేటి సాక్షి ప్రతినిధి చేవెళ్ల అక్టోబర్ 23:)*రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ పండుగను ఘనంగా.నిర్వహించారు.కావాలి మణీత్, యాదవ్ గొంగుపల్లి శ్రీపాల్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు,నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.పండుగ సందర్భంగా దున్నపోతుల ఆటలు, సాంప్రదాయ పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. సదర్ పండుగ చూడు… దున్నపోతుల ఆట చూడు… అంటూ చిన్నా పెద్దా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గోంగుపల్లి శ్రీ పాల్ మాట్లాడుతూ:-సదర్ పండుగ మన యాదవ సమాజ ఆత్మ గౌరవానికి ప్రతీక.ఈ పండుగలో ప్రతి ఒక్కరూ ఐక్యతతో పాల్గొని ఆనందించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనుష సత్తయ్య గౌడ్, షాబాద్ రాములు కావలి కృష్ణయ్య, కావలి మణీత్ గోంగుపల్లి శ్రీపాల్ యాదవ్ సాయికుమార్, రమేష్ గౌడ్, రవితేజ, కావలి కృష్ణ, షాబాద్ అనిల్, షాబాద్ కిట్టు, గొంగుపల్లి శ్రీకాంత్, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.





