Saturday, March 14, 2026

కార్తీకమాసంలో అమ్మవారి దర్శనం ఎంతో ప్రాశస్థ్యం* *లలితమాత ఆలయ ఫౌండరీ ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప*——-జగిత్యాల టౌన్

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………కార్తీకమాసం చాలా విశిష్టమైనదని , ఈ మాసంలో అమ్మవారు, శివుడిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని 108 శ్రీచక్ర సహిత శ్రీ లలితమాత ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప అన్నారు. లలితామాత ఆలయం,శ్రీ సూర్య ధన్వంతరి ఆలయాల్లో శుక్రవారం సుహాసినీలు ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు.జగిత్యాల పట్టణ చింతకుంట లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి అధ్వర్యంలో శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని, మాతలు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం గావించారు. పారాయణం అనంతరం మాతలు అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు.కుంకుమ పూజ అనంతరం లక్కీ డిప్ ద్వార ఒక్కరిని ఎంపిక చేసి వారికి అమ్మ వారి శేష వస్త్రం ఆలయ పూజారి ఆశీర్వచనములతో సత్కరించారు.జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని శ్రీ చక్ర సహిత లలితామాత ఆలయంలో ఫౌండరి ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప ఆధ్వర్యంలో మహిళలు లలితా సహస్రణామ పారాయణం చేసి, శ్రీ చక్రాలకు కుంకుమ పూజలు చేయగా చెల్లం స్వరూప మరకత శ్రీ చక్రానికి భక్తి శ్రద్ధాలతో కుంకుమ పూజ చేశారు.అనంతరం స్వరూప మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు.అందుకే భక్తులు ఆలయాలు సందర్శించి భక్తి భావం పెంపోందించుకోవాలని స్వరూప సూచించారు.ఈ కార్యక్రమములో పొలాస ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, మహేందర్, సత్తయ్య, డాక్టర్ వడ్లగట్ట రాజన్న, వోడ్నాల శ్రీనివాస్, గంగాధర్,ఉటూరి కళ్యాణి, హరిత, ఉటూరి అర్చన,వోడ్నాల లత, శ్వేత, భీమేశ్వరి, యశోద, గంగమ్మ, గంగమ్మ, అర్చకులు శ్రీహరి అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News