నేటిసాక్షి, మిర్యాలగూడ : పత్తి పంటలో పచ్చ దోమ, తెల్ల దోమ మరియు ఆకుమచ్చ తెగులు, కాయ తొలుచు పురుగు పై రైతులకు దామరచర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి యం.రూషేంద్ర మణి నివారణ పై రైతులకు అవగాహన కల్పించారు. నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండల పరిధిలోని కల్లేపల్లి గ్రామంలో వ్యవసాయ అధికారి యం.రూషేంద్ర మణి, పత్తి పొలాల ను సందర్శించారు. ఈ సందర్భంగా పత్తి పంటలో పచ్చ దోమ, తెల్ల దోమ, మరియు ఆకు మచ్చ తెగులు, కాయ తొలుచు పురుగును గమనించారు. నివారణ చర్యలకు గాను రసం పీల్చే పురుగులకు ఎసేటమీప్రైడ్ 2గ్రామ్/లి, ఆకు మచ్చ తెగులు కి కార్బన్డిజం+మ్యాన్కోజప్, లద్దపురుగులకు ఇమామెట్టిన్ బెంజోయేట్ మరియు వేప నూనె పిచికారి చేసుకోవాలని రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో రైతులు లావుడియా ఎర్రనాయక్, ధీరావత్ నిమ్మ, బాబు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు ఆర్. పార్వతి, సైదులు తదితరులు పాల్గొన్నారు.





