నేటి సాక్షి, బెజ్జంకి:సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ బెజ్జంకి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి & పాకాల శ్రీనివాస్ రెడ్డి గార్ల తండ్రి పాకాల చల్మారెడ్డి (రిటైర్డ్ టీచర్ )గత ఐదు రోజుల క్రితం మరణించగా శుక్రవారం సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ నాయకులు పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి, మరియు జిల్లా రెడ్డి జేఏసీ నాయకులు రామచంద్రారెడ్డి, గాల్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, శైలజ రెడ్డి మరియు లక్ష్మిపూర్ గ్రామ రెడ్డి జేఏసీ నాయకులు పల్లె రాజిరెడ్డి, పాకాల కృష్ణాకర్, అనుమాస శ్రీనివాస్ రెడ్డి,తాడూరి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





