(నేటి సాక్షి)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 127 రంగారెడ్డి నగర్ డివిజన్ కురుమ యాదవ సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సదర్ సమ్మేళనంలో పాల్గోని దున్నరాజుల ప్రదర్శనను విక్షించారు..అనంతరం సదర్ సమ్మేళన ఉత్సవ కమిటీ సభ్యులు వారి ఆచార సంప్రదాయాలతో మాజీ ఎమ్మెల్యే సన్మానించడం జరిగింది..ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం కులవృత్తులా కూటిరా పరిశ్రమా అని కొనియాడారు..యాదవ సోదరులు దున్నరాజులను పూజించి పాడి పశు సంపదను సంరక్షించుకొని ప్రతి సంవత్సరం సదర్ సమ్మేళనం జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు..నా బాల్యం, నా జీవన విధంగా అన్ని కులాలతో ముడిపడిఉందని సదర్ సమ్మేళనంలో గుర్తుచేసారుఈ కార్యక్రమంలో లింగం యాదవ్, బాలరాజ్, మోటే శ్రీనివాస్ యాదవ్, నవీన్ కురుమ, శ్రీకాంత్ యాదవ్, సాయి, అశోక్, కిరణ్ యాదవ్, అంజప్ప, రవి, తిరుమలయ్య మరియు కాలనీవాసులు యాదవ్ సంఘ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు





