Saturday, March 14, 2026

జస్టిస్ బీ.ఆర్. గవాయిపై జరిగిన దాడికి నిరనసగా* *హైదరాబాదులో నిర్వహించే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయండి.**దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే సహించం*———జగిత్యాల

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)……………….ఆత్మగౌరవం కంటే తమకు ఏది ముఖ్యం కాదని, దళిత జాతి ఆత్మ గౌరవానికి ఆటంకం కలిగితే ఎంతటి పోరాటానికైనా సిద్ధ మని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, నాయకులు స్పష్టం చేశారు. ఆత్మగౌరవ విషయంలో రాజీపడటమంటే ప్రాణం లేని నిర్జీవంతో సమానమని అభిప్రాయపడ్డారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ, జిల్లా అధ్యక్షులు దుమల గంగారం మాదిగ ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్ మాదిగ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయిపై జరిగిన దాడి దేశంలోని దళిత ప్రజలందరిపై జరిగిన దాడిగా చూస్తున్నామని, ఇది దేశ ప్రజాస్వామిక విలువలపై, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి జరిగినట్లేనని వీరు అన్నారు. జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ నవంబర్, 01,న హైదరాబాద్ లో దళితుల ఆత్మగౌరవ మహా నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని వారు పిలుపు నిచ్చారు. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయి పై రాకేష్ కిషోర్ అనే అతను ఒక అడ్వకేట్ అయి ఉండి బూటును విసిరేశాడు. రాకేష్ కిషోర్ అడ్వకేట్ వృత్తిని రద్దు చేయాలని, కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టుపెళ్లి లక్ష్మణ్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు భువనగిరి కిషన్ మాదిగ, జిల్లా కార్యదర్శి సాంగేపు ముత్తు, ఉమెన్ రైట్స్ రాష్ట్ర నాయకులు నక్క గంగారం, జగిత్యాల నియోజకవర్గం ఇన్చార్జి బొల్లారపూ దివాకర్, మాదిగ, పట్టణ ప్రధాన కార్యదర్శి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News