Saturday, March 14, 2026

*అమరుల సేవలు మరువలేనివి*——-* పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రికార్డు స్థాయిలో ‘మెగా రక్తదాన శిబిరం’* శిబిరాన్ని ప్రారంభించిన మెట్ పల్లి డీఎస్పీ రాములు* కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో యువతచే ఉత్సాహభరిత కార్యక్రమం——-*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘మెగా రక్తదాన శిబిరం’ రికార్డు స్థాయిలో ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్ల సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో కోరుట్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు.మెట్ పల్లి డీఎస్పీ రాములు ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, మొదటి రక్తదాతకు పండ్లు అందజేశారు. పోలీసులు, స్థానిక యువత, వ్యాపారస్తులు, రెడ్ క్రాస్ సభ్యులు కలిసి సుమారు 100 యూనిట్ల రక్తం దానం చేశారు.*అమరవీరుల త్యాగాలు మరువలేనివి*ఈ సందర్భంగా డీఎస్పీ రాములు మాట్లాడుతూ..“దేశ శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత. వారి త్యాగాలకు నిజమైన నివాళి రక్తదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారానే ఉంటుంద’ని పేర్కొన్నారు.అలాగే, “ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాక, ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతలమవుతామ’ని తెలిపారు.ఈకార్యక్రమంలో కోరుట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సురేష్, ఎస్‌ఐలు చిరంజీవి, శ్రీధర్ రెడ్డి, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News