Saturday, March 14, 2026

మాధవరం గ్రామంలో వెదజల్లుతున్న దుర్గంధపు వాసన పట్టించుకోని అధికారులు….. వాసనకు తిండి తినలేక పోతున్నాం…..

నేటి సాక్షి, నారాయణపేట అక్టోబర్ 25, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని మాధవరం గ్రామంలో పలు కాలనీలో దుర్గంధపు వాసన తో రెండు పూటల తిండి కూడా తినలేక పోతున్నామని మాధవరం గ్రామస్తులు మొగులన్న చంద్రమ్మ, రాజమ్మలు అన్నారు. శనివారం గ్రామంలో స్థానిక విలేకరులతో కాలనీవాసులు మాట్లాడుతూ దుర్గంధపు వాసన వెదజల్లుతున్న గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మురుగు నీటితో పాములు దోమలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుకున్న ఇండ్లలోకి మురుగునీరు చేరుతుందన్నారు. గ్రామంలో డ్రైనేజీలు కూడా సక్రమంగా లేవని వారు ఆరోపించారు. రెండు పూటలా తిండి కూడా తినలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు. లో ఉన్న సర్పంచులు కూడా పట్టించుకోలేదు అన్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సిసి రోడ్లను వేయించాలని మాధవరం గ్రామస్తులు నారాయణపేట జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు లేనియెడల మాధవరం గ్రామస్తుల ఆధ్వర్యంలో మరికల్ మండల ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారి హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News