నేటి సాక్షి,బాపట్ల జిల్లా,(బాపట్ల రూరల్)కల్తీ మద్యం అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యం అని బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ అన్నారు.బాపట్ల పట్టణం సూర్యలంక రోడ్డు లోని మిత్ర వైన్స్ మద్యం దుకాణం వద్ద ఆకస్మిక తనికి నిర్వహించి, విక్రయిస్తున్న మద్యాన్ని స్వయంగా పరిశీలించి, కల్తీ మద్యాన్ని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్సైజ్ సురక్ష యాప్ వినియోగం గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూనకిలీ మద్యం కట్టడి కోసం టెక్నాలజీ బాటలో ఏపీ ప్రభుత్వం అని నకిలీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం “ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్” ను అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్‌కు సంబంధించిన అన్ని వివరాలు వెంటనే మీ మొబైల్లో కనిపిస్తాయని తెలియజేశారు. రిటైల్ షాపుల్లో కూడా స్కాన్ చేసిన తర్వాతే అమ్మకాలు జరగాలి అనే విధానం ప్రారంభమవుతోందని అన్నారు.వినియోగదారులు కూడా యాప్ ద్వారా తయారీ తేదీ, టైమ్, బ్యాచ్ నంబర్ వంటి వివరాలను చెక్ చేసుకోవచ్చు తెలిపారు. ప్రతి బాటిల్‌కి ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ సదుపాయాలు ఉంటాయని తెలిపారు.ఒక షాపుకు సరఫరా చేసిన మద్యం ఇతర షాపుల్లో అమ్మడం అసాధ్యం అని అన్నారు. టెక్నాలజీతో మద్యం నియంత్రణలో కొత్త దశకు ఏపీ అడుగుపెడుతోంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.





