నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)ఈనెల మూడు రోజులపాటు రానున్న వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల ఆర్డిఓ గ్లోరియా అన్నారు.కర్లపాలెం గ్రామం లోని పంట పొలాలను ఆర్డీవో గ్లోరియా పరిశీలించారు. మంతా తుఫాను కారణంగా రానున్న 4 రోజుల్లో అంటే 29 తారీఖు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కావున రైతులు అప్రమత్తంగా ఉండి వారి పొలాలలో ఉండే నీళ్లను సాధ్యమైనంత వరకు త్వరగా తీసివేయాలని పంట డ్రైనేజ్ కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువస్తే త్వరిత గతిన పరిష్కరిస్తామని రైతులను కోరారు. అనంతరం మండల వ్యవసాయ అధికారిని పంట నష్టం వివరాలను అడగగా వారు ప్రస్తుతానికి మండలంలో ఎటువంటి పంట నష్టం జరగలేదని తెలిపారు. ఆయన వెంట కర్లపాలెం మండల అధికారి అద్దూరి శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ , సచివాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.





