నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………..జగిత్యాల జిల్లా వెల్కటూర్ మండలం జగదేవపేటకు చెందిన కొర్రి పోచయ్య, పెద్దలక్ష్మి వృద్ధ దంపతులు తమ ఇంటికి వెళ్లే రోడ్డును కొందరు కబ్జా చేశారని తమ బాధను విన్నవించారు.గత రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేసినట్లు వృద్ధ దంపతులు తెలిపారు.సీఎం ఫోన్ చేసి చెబితేనే సమస్య పరిష్కరిస్తామని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తమకు న్యాయం చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ గేటు వద్ద వంటా వార్పుతో వృద్ధ దంపతుల నిరసన తెలిపారు.





