Saturday, March 14, 2026

*ముగిసిన బ్లాక్ స్థాయి క్రీడ పోటీలు*

నేటి సాక్షి, ధర్మారం (అక్టోబర్ 25) : కేంద్ర యూత్ మరియు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ మై భారత్ మరియు యువ తరంగ్ యూత్ ఆధ్వర్యంలో ధర్మారం మండలం నందిమేడారం బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ విద్యాసాగర్ రావు, మండల వైద్యాధికారి డాక్టర్ అనుదీప్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజుకుమార్, యువ తరంగ్ యూత్ అధ్యక్షుడు బండవరం సుమన్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. వాలీబాల్ లో కమ్మరి ఖాన్ పేట, కబడ్డిలో బంజేరుపల్లి జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆర్గనైజర్ రేషవేణి మహేష్, యువ తరంగ్ యూత్ ప్రతినిధులు బొమ్మగాని సతీష్, జుర్రు సతీష్, గుమ్ముల సతీష్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News