( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 25:)*జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాండురంగారెడ్డి మాట్లాడుతూ…సామాజిక తెలంగాణ,సమాన న్యాయం కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించిన జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నిజామాబాదు జిల్లాలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు,జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్,కార్యదర్శి అర్చన సేనపతి,రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ముస్తపా,రామ్ కోటి,సోషల్ మీడియా కన్వీనర్ వర్ష,జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారి లావణ్య,విద్యార్థి విభాగం రాము యాదవ్,నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి మాట్లాడుతూ:-ఉద్యమకారులకు ఊపిరిగా,బడుగులకు బాసటగా,ఆదివాసులకు అండగా,నిరుద్యోగులకు మద్దతుగా,సామాజిక న్యాయం లక్ష్యంగా జాగృతి జనం బాట కార్యక్రమం కొనసాగుతోంది.ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపి ప్రజల్లో అవగాహన కలిగించడం ప్రధాన ఉద్దేశ్యం.మేధావులతో చర్చలు జరిపి ప్రజలతో మమేకమయ్యే ఈ కార్యక్రమం తెలంగాణలో నూతన దిశను చూపుతుంది అని పేర్కొన్నారు.కప్పాటి పాండురంగా రెడ్డితెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు,రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్





