Saturday, March 14, 2026

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు త్వరగా కోలుకోవాలని పాదయాత్ర.

నేటి సాక్షి – లక్షేట్టిపేట(రేగుంట ప్రసాద్) అక్టోబర్ 25: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్యం మెరుగుపడి,త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో పాల్గొనాలని ఆశిస్తూ మండలంలోని సూరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మల్లికార్జున్ శనివారం సూరారం గ్రామం నుండి దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. శనివారం కాలినడక వెళ్లి సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షేటిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు కాలినడకన వెళుతున్న మల్లికార్జున్ ను ఘనంగా స్వాగతించి, పూలమాలలు వేసి ఆయన వెంట పాదయాత్ర చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్యం మెరుగుపడి ప్రజాసేవ లోకి రావాలని కోరుతూ కాలి నడకన వెళుతున్న మల్లికార్జున్ ను పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, మాజీ సర్పంచ్ బియ్యాల సుధాకర్, మాజీ వైఎస్ ఎంపీపీ పెండెం రాజు, మైనారిటీ సీనియర్ నాయకులు మహ్మద్ షేక్ అలీ, కాంగ్రెస్ నాయకులు లింగంపెల్లి తిరుపతి, సురేందర్,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News