నేటి సాక్షి నల్లబెల్లి ప్రతినిధి అక్టోబర్ 25 : నల్లబెల్లి మండలం ముచింపుల గ్రామంలో అర్ధరాత్రి అనుమాదాస్పద రీతిలో ఒక ఆటో అగ్నిప్రమాదానికి గురైంది. మచ్చిక మహేష్ అనే ఆటో డ్రైవర్ శుక్రవారం సాయంత్రం సుమారు రాత్రి 11 గంటల సమయంలో రోజు కిరాయిలు కొట్టే విధంగానే నడుపుకుంటూ వచ్చి ముచ్చింపుల గ్రామంలో తన ఇంటి పక్కన ఉన్న హనుమాన్ గుడి ముందువున్నా రేకుల కింద నిలిపాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ మంటలు , పొగ రావడం చూసిన చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఆటో కాల్తోందంటూ మహేష్ కు ఫోన్ చేసి తెలపగా వెంటనే వచ్చిన మహేష్ చుట్టుపక్కల ఉన్న స్థానికుల సహాయంతో బడ్జెట్లతో నీళ్లు చల్లడంతో మంటలను అర్పినప్పటికీ ఆటో మొత్తం దగ్ధమైనట్టు, బ్యాటరీ వేడికి షార్ట్ సర్క్యూట్ అయిందనుకుంటూ.ఈ ఘటనపై బాధిత మహేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.





