నేటి సాక్షి, బాపట్ల జిల్లా,(పర్చూరు)ఉప్పరపాలెం గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని,గ్రామంలో అవసరమైన మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. శనివారం గ్రామంలోని కృష్ణ వెస్ట్రన్ డెల్టా కాలుపై గ్రామస్తుల సౌకర్యార్థం రూ 10 లక్షలతో ఏర్పాటు చేసిన బల్ల కట్టును ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో గ్రామానికి ఆర్ అండ్ బీ (R&B) రోడ్డు నిర్మాణం చేపడతామని, అంతర్గత రోడ్లు, స్మశాన వాటిక రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజల అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు.పర్చూరు మండలంలోని చెరుకూరు ఉప్పరపాలెం గ్రామంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బల్ల కట్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ఏలూరి కి ఘన స్వాగతం పలికారు. పూల హారాలతో, మంగళవాద్యాలతో గ్రామంలో జయజయధ్వానాలువమోగాయి.గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.*గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది*ఎమ్మెల్యే ఏలూరి పర్యటనతో గ్రామం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. గ్రామంలో సమస్యలు పరిష్కారానికి ఎమ్మెల్యే ఏలూరి హామీ ఇవ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున జై ఏలూరి అంటూ నినాదాలు చేశారు.పెద్దలు, మహిళలు, యువతతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





