నేటి సాక్షి, బాపట్ల జిల్లా (పర్చూరు)గిరిజన విద్యార్థుల విద్యా అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది. గిరిజన విద్యకు పెద్దపీట వేస్తూ కూటమి సర్కారు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతుంది. దీనిలో భాగంగా పర్చూరు నియోజకవర్గ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాల (బాలురు)లో రూ.5.30 కోట్ల వ్యయంతో అదనపు వసతుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ కలిసి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేశారు. గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక నేతల హర్షద్వానాల మధ్య శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.*విద్యార్థుల భవిష్యత్‌కి పెట్టుబడి:ఎమ్మెల్యే ఏలూరి*గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని దీనిలో భాగంగా సదుపాయాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.ఈ గురుకుల పాఠశాలలు గ్రామీణ మరియు అట్టడుగు వర్గాల పిల్లలకు విద్యా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఆధునిక తరహా తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, డైనింగ్ హాల్, హాస్టల్ గదులు వంటి సౌకర్యాలు ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడనున్నాయని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. అత్యాధునిక హంగులతో నాణ్యత ప్రమాణాలతో పనులు వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు.*గిరిజన విద్యకు ప్రాధాన్యం:కలెక్టర్ వినోద్ కుమార్*జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా గురుకుల పాఠశాలల అభివృద్ధి చేపట్టిందన్నారు.ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత విద్యార్థులకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు.బడికి వెళ్లే పిల్లలకు అమ్మకువందనం పథకం ద్వారా సంవత్సరానికి రూ.15 వేలు తల్లి బ్యాంక్ ఖాతాకు జమచేస్తుందని తెలిపారు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థి కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్టును అందజేస్తుందని మధ్యాహ్నం నాణ్యతమైన భోజనం పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన విద్యార్థులు అందరు బాగా చదువుకోవలన్న ఉద్దేశంతో ఇక్కడ సుమారు రూ.530 లక్షలతో వసతి గృహంకు అదనపు గదులు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. తొలుత విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ లకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాల కార్పోరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ , మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు , డిఆర్డిఏపిడి లవన్న, తాసిల్దార్ బ్రహ్మయ్య, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షంషుద్దీన్, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ హుస్సేన్, ఆర్టిడి కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణ, డిసీ చైర్మన్ పొద వీరయ్య, నాయుడు హనుమంతరావు, రంగయ్య, డిఇ సృజన, పాఠశాల ప్రిన్సిపల్ వెంకటసుబ్బయ్య, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు.





