నేటి సాక్షి (భూమయ్య)మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో కొల్చారం మండలం పోతన్శెట్టిపల్లి గ్రామ పరిధిలోని ఎడుపాయల టీ-జంక్షన్ వద్ద, అక్రమంగా తరలిస్తున్న 370 పీడీఎస్ బియ్యం సంచులు (ప్రతి సంచి 50 కిలోలు) తీసుకెళ్తున్న ఒక డీసీఎం వాహనాన్ని ఆపి పట్టుకున్నారు. పట్టుబడిన వాహనం మరియు బియ్యం సంచులను కుల్చారం పోలీస్ స్టేషన్కు అప్పగించి, కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ఇటువంటి చర్యలపై ఎల్లప్పుడూ పోలీసుల నిఘా కొనసాగుతుందని తెలిపారు.అలాగే ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.





