నేటి సాక్షి, కొడిమ్యాల అక్టోబర్ 25.శనివారం జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోగంజాయి అమ్ముతున్నాడన్న పక్క సమాచారం మేరకు తేదీ 24-10-2025 రోజు రాత్రి సమయంలో కొడిమ్యాల గ్రామ శివారులో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కి సమీపంలో గంజాయి కలిగి ఉన్న 1. చర్ల రఘురాం అలియాస్ లక్కీ తండ్రి అంజయ్య, 21సం. కులం: మాల, శనివారం పేట గ్రామం.2. గుమ్మడి దారి ఆదిత్య. తండ్రి రాజేశం, 19సం. కులం కుమ్మరి, గ్రామం కొడిమ్యాల.అను ఇద్దరిని కొడిమ్యాల ఎస్ఐ సౌడం సందీప్. తన యొక్క సిబ్బందితో కలిసి పట్టుకొని విచారించి వారి వద్ద నుండి 70 గ్రాముల నిషేధిత గంజాయి పట్టుకోవడం జరిగింది. చర్ల రఘురాం గంజాయిని బల్హర్ష మహారాష్ట్ర పట్టణం లో ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుండి కొనుగోలు చేయడం జరిగింది. అని విచారించగా తెలిపినాడు. ఇ విషయంపై కొడిమ్యాల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి ఎస్సై దర్యాప్తు ప్రారంభించడం జరిగినది.





