Saturday, March 14, 2026

*తిరుచానూరు పవిత్రతను కాపాడండి* *-తిరుచానూరు హిందూ ధర్మ పరిరక్షణ సమితి*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి రూరల్,అక్టోబర్ 27: పరమ పవిత్రమైన హిందూధర్మిక క్షేత్రం తిరుచానూరు పవిత్రతను కాపాడాలని కోరుతూ అమ్మవారి ఆలయం వద్ద తిరుచానూరు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా తిరుచానూరులో పూర్తిస్థాయిలో మాంసాహార పదార్థాలు విచ్చలవిడిగా ఎక్కడబడితే అక్కడ అమ్మడం జరుగుతుంది .హిందూ ఎండోమెంట్ యాక్ట్ 1987 మరియు జీవో నెంబర్ 746,747 ప్రకారం తిరుచానూరులో ఆలయం వద్ద సాంప్రదాయమైనటువంటి విషయాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తుంది .మద్య మాంసాలు అమ్మడం చేయరాదు కానీ దీని వ్యతిరేకంగా తిరుచానూరు గుడి సమీపంలోని చికెన్ షాపులు అమ్మవారి పసుపు మండపం పక్కన చికెన్ షాపులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అమ్మ వారి గేటు ఆనుకొని చికెన్ షాపులు పెట్టి 1987 చట్టం ప్రకారం ఈ విధమైనటువంటి పూర్తిగా నిషిద్ధం కానీ వీటిని అడిగే నాధుడు లేనటువంటి పరిస్థితి ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఈవో వీటిని పరిశీలించి నిషేధించాల్సిన అవసరం ఉంది.కానీ వారు ఎవరు పట్టించుకోవడం లేదు కావున తిరుచానూరు ధర్మ పరిరక్షణ సమితి తరపున హిందూ ఎండోమెంట్ ఆక్ట్ 1987 జీవో నెంబర్ 747, 746 ప్రకారం నియమ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ధార్మిక వ్యతిరేకమైన విషయాలను అడ్డుకోవాలని సమితి డిమాండ్ చేస్తుంది .జీవో నెంబర్ 747 746 ప్రకారం తిరుచానూరులో అన్యమత ప్రచారాలు కూడా చేయరాదని ఈ జీవోలు తెలియజేస్తున్నాయి.వీటిపై త్వరలో అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నాము.తిరుచానూరులో హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ సంస్థ శక్తి వంచన లేకుండా పని చేస్తుందనీ సమితి సభ్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మహేష్ డేగల,అధ్యక్షులు మునిరామ్ రెడ్డి, ఉపాధ్యక్షులు పొన్నా రవి కుమార్,ప్రధాన కార్యదర్శి గిరీష్ కుమార్ ,కార్యదర్శి బాల మురళీ కృష్ణ, పూర్ణ,జాయింట్ సెక్రటరీ తుమ్మలపల్లి సోము,వి.బాలాజీ,.టి.కిరణ్ కుమార్, డి.సుకుమార్,జే. కె యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News