నేటి సాక్షి (పూరెళ్ల బాపు )………………… వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం రేపు మంగళవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించబడుతుంది.ఈ కార్యక్రమంలో ప్రత్తి మరియు మొక్కజొన్న కొనుగోలుపై మార్కెటింగ్, మార్కుఫెడ్ మరియు సిపిఐ అధికారులతో రైతులకు అవగాహన కల్పిస్తారు.కావున జగిత్యాల జిల్లా లోని రైతులు తమ సమీప రైతు వేదికలలో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్తి మరియు మొక్కజొన్న కొనుగోలుపై సందేహాలను నివృత్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సూచించారు.





