నేటి సాక్షి జిన్నారం (అమీన్పూర్)కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో తెల్లవారుజామునుండే భక్తుల సందడి కనిపించింది. మహా రుద్రాభిషేకం, సామూహిక అభిషేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించాం.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసాం. దీపాలను వెలిగించేందుకు ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి సోమవారం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం.కార్తీకమాసం సందర్భంగా స్వామివారి కృప అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, తెలిపారు

