Saturday, March 14, 2026

సర్వధర్మ సమ్మేళనం సామాజిక ఐక్యతకు నాంది పేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్‌.

నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 27,నారాయణపేట జిల్లా కొల్లంపల్లి దర్గా వద్ద సోమవారం నిర్వహించిన 25వ సర్వధర్మ సమ్మేళనం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ — జిల్లాలో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయడం చాలా మంచిది అన్ని మతాల సారం ఒక్కటే ప్రజలంతా భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి మెలిసి జీవించాలని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమేనని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే తేడా ఉండదని తెలిపారు. “సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం నెలకొనడానికి సర్వధర్మ సమ్మేళనాలు ఇలాంటి కార్యక్రమాలు కీలకం అని తెలిపారు. భిన్న మతాల మధ్య ఐక్యతతో ముందుకు సాగితేనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుంది” అని ఆయన తెలిపారు. ప్రతి పౌరుడు శాంతి, సామరస్యాన్ని కాపాడే బాధ్యతతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తది తరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News