( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 27:)*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరు రెవెన్యూ పరిధిలో కొత్తగా నిర్మించిన కాకి కుమార్ ముదిరాజ్ ఫంక్షన్ హాల్‌ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఉదయం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కాకి కుమార్ ముదిరాజ్ కుటుంబ సభ్యులు శాలువా కప్పి,జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





