Wednesday, March 18, 2026

*జగిత్యాల జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక*———–*డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………….జగిత్యాల జిల్లా కలెక్టర్ సమక్షంలో విరూపాక్షి గార్డెన్ లో A4 దుకాణాల వైన్ షాపుల కోసం డ్రా నిర్వహణ.A4 దుకాణాల మద్యం దుకాణాల కోసం లాట్ల డ్రాను సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్ లో నిర్వహించారు. డ్రా నిర్వహణ సందర్బంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీస్ లు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు చెపట్టారు. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ మరియు జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, దరఖాస్తులు గత నెల 26 నుండి ఈ నెల 23 వరకు జగిత్యాల లోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌లో స్వీకరించబడ్డాయి.*ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ*జిల్లాలో మొత్తం 71 మద్యం దుకాణాలకు డ్రా నిర్వహిస్తుండగా, 1966 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. 71 మధ్యం దుకాణాలలో SC సామాజిక వర్గానికి 8, గౌడ వర్గానికి 14, ఓపెన్ కేటగిరీలో 49 మద్యం దుకాణాలు కేటాయించడం జరిగిందని వివరించారు.ఎంపికైన నూతన నిర్వాహకులు డిసెంబర్ 1 నుండి కొనసాగుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News