Wednesday, March 18, 2026

ప్రమాదకరంగా రోడ్ మధ్యలో గుంట..ఆదమరిస్తే అంతే..ప్రాణాలు గాలిలో కలవాల్సిందే..పట్టించుకొని ఆర్ అండ్ బి అధికారులు..

నేటి సాక్షి పాలేరు , అక్టోబర్ 25 :రోడ్ మధ్యలో పెద్ద గుంట ఏర్పడి ప్రమాదకరంగా మారి నెలలు గడుస్తున్నాయి .. అయిన కనీసం ఆర్ అండ్ బి అధికారులు గుంతను పూడ్చే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.. వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది.. ఇక వివరాల్లోకి వెళితే.. కూసుమంచి మండలం నాయకన్ గూడెం నుండి కోదాడ వెళ్ళే రహదారిపై భగవత్ వీడు తండా గ్రామ వద్ద రోడ్ పై పెద్ద గుంత పడింది.. ఈ గుంత దగ్గరకు రాగానే వాహన దారులు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తూ ప్రమాద భారిన పడుతున్నారు.. అంత పెద్ద గుంత రోడ్ మధ్యలో ఉండడంతో వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు కలగడమే కాకుండా రాత్రి వేళలో గుంత కనపడక ఇబ్బందులు పడుతున్నారు.. ఇటీవల గుంత వలన ప్రమాద భారిన పడి ప్రాణాపాయం నుండి బయటపడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయి.. ఎప్పటికపుడు రోడ్లను పరిశీలించి దెబ్బతిన్న , గుంతలు పడ్డ రోడ్లను సరిచేయకపోవడంతో మృత్యు దారులుగా మారాయి.. వెంటనే గుంతలను పూడ్చి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News