Wednesday, March 18, 2026

*ఎన్.ఎం.ఎం.ఎస్ స్టడీ మెటీరియల్ పంపిణి**

నేటి సాక్షి, కోరుట్ల టౌన్* (గణేష్ గొల్లపల్లి)కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేముల లక్ష్మీపతి లక్ష్మీదేవి మెరిట్ అవార్డు ఫౌండేషన్ కోరుట్ల వారు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) కు సంబంధించిన స్టడీ మెటీరియల్ను విద్యార్థులకు ఉచితంగా అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.ఆనంద్, ఎన్.ఎం.ఎం.ఎస్ పాఠశాల ఇన్చార్జ్ ఎక్కలదేవి బాలాజీ గంగాధర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 48 వేల రూపాయల స్కాలర్షిప్ అందుతుందని తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News