నేటి సాక్షి,కోరుట్ల టౌన్* (గణేష్ గొల్లపల్లి)కోరుట్ల మున్సిపాలిటీకి యుఐడిఎఫ్ పథకంలో భాగంగా 18 కొట్ల 70 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల సోమవారం కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే, కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కోరుట్ల మున్సిపాలిటీ లోనే 33 వార్డుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం 18 కోట్ల 70 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఇట్టి నిధులను వార్డుల అభివృద్ధి కోసం వినియోగించాలని, అధికారులను కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీమ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నం అనిల్, ఎలిశెట్టి భూమారెడ్డి, రిజ్వాన్ పాషా, జిందం లక్ష్మీనారాయణ, ఆడెపు మధు, బలిజ రాజిరెడ్డి, బద్ది మురళి, ఏఆర్ అక్బర్,లక్ష్మణ్, వసీం, నర్సయ్య, లక్ష్మణ్, వాసిద్, తెడ్డు విజయ్, రాజు, శ్రీ వెంకటేశ్వర దేవాలయ అధ్యక్షులు ఎతిరాజం నర్సయ్య, కటుకం దివాకర్, అశోక్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





