Saturday, March 14, 2026

లక్షలాది మందితో. దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తాం మందకృష్ణ మాదిగ* *20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం బాధాకరం ఎమ్మెస్పి రంగారెడ్డి జిల్లా రావుగళ్ళ,బాబు మాదిగ*చీఫ్ జస్టీస్ బిఆర్ గవాయ్ దాడి ఘటన మీద కేసు ఎందుకు నమోదు చేయడం లేదు ?© ఎన్నో కేసులను సుమోటో గా స్వీకరిస్తున్న పోలీసు వ్యవస్థకు , న్యాయవ్యవస్థకు చీఫ్ జస్టిస్ గారి మీద జరిగిన దాడి కనిపించడం లేదా..?విశ్వాసాలు, ధర్మాల పేరుతో దాడులు చేస్తే వారికి చట్టాలు వర్తించవా..?

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 27:)*సిజే పై దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని కోరుతూ చేపట్టే ఈఆత్మగౌరవ ర్యాలీకి దళితులతో పాటుగా న్యాయ వ్యవస్థ మీద గౌరవాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం కోసం కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున తరలి రండి.- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ దేశ రాజధానిలో, అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద దాడి జరిగితే ఇంకా కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు ? ఎన్నో కేసులను సుమోటో గా స్వీకరిస్తున్న పోలీసు వ్యవస్థకు , న్యాయవ్యవస్థకు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి కనిపించడం లేదా..? అనేక విషయాల మీద స్పందించే మానవ హక్కుల కమిషన్ కు మౌనం ఎందుకు..? కోర్టులో దాడి జరిగినా కంటెంట్ ఆఫ్ కోర్టు, కోర్టు ధిక్కరణ కింద శిక్షలు ఎందుకు పడవని అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు.శంషాబాద్ నందు గల టౌన్ స్పేర్స్ స్టే హోటల్ నందు మీడియా సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ” సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని అన్నారు. ఈ దాడి జరిగి నేటికి 20 రోజుల గడుస్తున్నా ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం దారుణమని అన్నారు. జస్టిస్ గవాయ్ గారి స్థానంలో ఉన్నత కులాలకు చెందిన జడ్జీ ఉంటే కేసు నమోదు చేయడంలో ఇలా నిర్లక్ష్యం చేసి ఉండే వారా? తను దళితుడు కాబట్టే స్పందించాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు కూడా మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు.హర్యానాలో ఒక లాయర్కు జడ్జికి వాగ్వివాదం జరిగితే జడ్జిని అమర్యాదగా మాట్లాడినందుకే అతనిపై సుమోటో కేసు పెట్టి చర్యలు తీసుకుంటున్నప్పుడు, ఇక్కడ సీజే మీద బూటుతో దాడుచేసిన కూడా కేసులు, అరెస్టులు లేవని గుర్తుచేశారు. దేశ ప్రధాని కాంచి మొదలుకుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్ అగ్ర నేతలు, దేశవ్యాప్తంగా దాడి ఘటనను ఖండించారని, ఈ ఘటన అనాగరికమైనది ఐనా అరెస్టులు, చట్టపరమైన కేసులు లేవని, దీనికి కారణం సీజె దళితుడు కావడమేనని మండిపడ్డారు. దాడిని ఖండించిన వాళ్లు కండన వరకే పరిమితమై అరెస్టుకు, కేసులు పెట్టాలని డిమాండ్ చేయకపోవడం ఆంతర్యం ఏమిటని..? ఈ ద్వంద్వ విధానాలతో దళితుల అస్తిత్వము ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఆత్మగౌరవం కంటే ఏది ముఖ్యం కాదని అన్నారు. విశ్వాసాలు, ధర్మాల పేరుతో దాడులకు దిగితే చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు.అందుకే జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడి దళితులపైన, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగ స్ఫూర్తి మీద జరిగిన దాడిగా చూస్తున్నామని అన్నారు.దళితులు ఎంత ఉన్నత స్థానానికి కష్టపడి ఎదిగినా కుల రక్కసి వెంటాడుతుందని అన్నారు. అందుకే గవాయి పై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ జాతీయ స్థాయిలో దళితుల ఆత్మగౌరవ పోరాటం చేపడుతున్నామని అన్నారు. గవాయ్ గారిపైన జరిగిన దాడి వల్ల దేశంలో ఉన్న దళితుల హృదయాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయని అన్నారు.కానీ 20 రోజులుగా ఎదురు చూస్తున్నా నేటికీ న్యాయం జరగలేదని అన్నారు. కనుకనే ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు.తక్షణమే దాడి ఘటన మీద కేసు నమోదు చేయాలి. నిందితుడిని అరెస్టు చేసి జైలులో పెట్టాలి.అలాగే ఈ ఘటన మీద సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జీ చేత విచారణ జరిపించి దీని వెనుక ఉన్న శక్తులను గుర్తించాలి.ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని అన్నారు. చీఫ్ జస్టిస్ గవాయి గారిపై దాడి విషయంలో న్యాయాన్ని కోరుతూ నవంబర్ 1న లక్షలాది మందితో ఛలో హైదరాబాద్ పేరుతో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తామని , ఈ ర్యాలీలో ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకునే దళిత ప్రజలు అలాగే న్యాయ వ్యవస్థ మీద గౌరవాన్ని నిలబెట్టడం కోసం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం కోసం కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు.నవంబర్ 1న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి సెక్రటేరియట్ పక్కకు ఉన్న గల పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన మహా ర్యాలీ జరుగుతుందని, ఈ ర్యాలీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి ప్రజలు తరలిరావాలని కోరారు.ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగళ్ల ఉపేందర్ మాదిగ, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు రావుగల్ల బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ళఎమ్మెస్ పి నరసింహ మాదిగ, ఎమ్మెస్ పి శంషాబాద్ ఇంచార్జి కొత్తూరు రమేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పోతుగంటి కృష్ణ మాదిగ, ఎమ్మెస్ పి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసారం శంకరరావు మాదిగ,రత్నం మాదిగ, బక్కని రవి మాదిగ, ఎర్ర కృష్ణమాదిగ, రాంచందర్ మాదిగ, ఎర్ర నవీన్ మాదిగ,గణేష్ మాదిగ, శంషాబాద్ అధ్యక్షులు చిన్నగండు భాస్కర్ మాదిగ, ఆనంద్ మాదిగ, బొబ్బిలి పాండు మాదిగ, సురేష్ మాదిగ,ప్రవీణ్ మాదిగ, రాజు మాదిగ,నిఖిల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News