నేటి సాక్షి – లక్షెట్టిపేట్(రేగుంట ప్రసాద్) అక్టోబర్ 27: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల ఫీజుల చెల్లింపు గడువును పెంచాలని పీ డీ ఎస్ యూ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు.కాకతీయ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఫీజుల చెల్లింపు గడువు సోమవారంతో ముగించడంతో మిగతా విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. బడుగు, బలహీన, వర్గాల విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉందని, కాబట్టి తక్షణమే డిగ్రీ విద్యార్థుల ఫీజుల తేదీల గడువును పొడిగించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్తీక్,అజయ్, ఆంజనేయులు,విజయ్,జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.





