నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 27:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల్ అధ్యక్షులు యదీష్ మాట్లాడుతూ…శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ గ్రామ పరిధిలో గల నరసింహకుంట (ఐడి నెంబర్. 2385) వద్ద కొందరు వ్యక్తులు అలుగు ఎత్తు పెంచడంతో, వర్షాకాలంలో ఎఫ్ టి ఎల్ స్థాయిని మించి నీరు నిల్వ అవుతూ, ఔటర్ రింగ్ రోడ్ ( ఔటర్ రింగ్ రోడ్) ఎగ్జిట్ నెంబర్.15 వద్ద నీటి మునక సమస్య ఏర్పడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.సాధారణ వర్షాలకు కూడా కుంట నిండిపోవడంతో,వరదనీరు రహదారిపై నిలిచి పాదచారులు,వాహనదారులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఇది ప్రజల భద్రతకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు.నరసింహకుంట అలుగు ఎత్తును పూర్వస్థితికి తగ్గించి,నీరు సాఫీగా బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని హెచ్ఎండిఏ కమిషనర్ ని గ్రామస్థులు సవినయంగా కోరారు.ఈ విజ్ఞప్తిని మాజీ సర్పంచులు మరియుగోల్కొండ దగ్గరలోని ఓ ఆర్ ఆర్ ఎగ్జిట్ 15 వద్ద వర్షాల వల్ల గత కొన్ని నెలలుగా నీరు నిలువ ఉండడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారిందనీ….. రాకపోకలకు అంతరాయం కలుగుతుందనీ….. వర్షం నీరు నిలవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అని….తక్షణమే చర్య తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని మహేశ్వరం బిజెపి మండల అధ్యక్షులు టి. యాదేశ్ మరియు రాష్ట్ర యువమోర్చా నాయకులు కుండే వెంకటేష్ కలిసి సమస్య వివరించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి మండల కార్యదర్శి బొమ్మ దేవేందర్, మహేందర్ బాబు…. చిన్న గోల్కొండ అనంత, వెంకట్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ రవి,పెద్దగోల్కొండ గ్రామ ప్రజలు సంయుక్తంగా సమర్పించారు.





