నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో మంగళవారం రోజు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెలుకల తిరుపతి మాట్లాడుతూ ముందస్తుగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని సహకరించిన వేములవాడ శాసనసభ్యులు అది శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశామన్నారు. లింగంపేట ఐకెపి కొనుగోలు కేంద్రం మహిళలచే నిర్వహించ బడుతున్నందున రైతులందరూ మహిళలకు సహకరించాలని అలాగే సెంటర్ నిర్వాహకురాలైన మహిళలు అధికారులకు సహకరించి ఇలా పరస్పరం ఒకరికొకరు సమన్వయ పరచుకుంటూ రైతులకు నష్టం వాటిల్లకుండా, ఇబ్బందులు జరగకుండా, తూకంలో మోసాలకు తావులేకుండా చూడాలన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా కల్లాల వద్దకు కాంటాలు తీసుకొచ్చాం అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, అధికారులు, హమాలీలు, రైతులు పాల్గొన్నారు.





