Saturday, March 14, 2026

*ఉపాధి హామీ గ్రామసభ* *

నేటి సాక్షి,గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండలం,గునుకుల కొండాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2026-27 ఆర్థిక సంవత్సరంకుగాను ఉపాధి హామీలో జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజులులబ్ది చేకూరేలా పని కల్పించే విధంగా నూతన పనులను ఎంపిక చేసి అంచనాలను తయారు చేయడం జరిగింది. ఉపాధి హామీలో చెప్పట్టే పనులు వ్యవసాయ పొలాలకు మట్టి రోడ్డు నిర్మాణాలు, అర్హత కలిగిన రైతులకు పశువుల పాకలు, గొర్రెల పాకలు, మొక్కల పెంపకం, ఉద్యానవన మొక్కల పెంపకం, అర్హత కలిగిన కుటుంబానికి వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణాలు, నాడెప్ కంపోస్ట్ పిట్ లు నిర్మించుకోవచ్చు అని గునుకుల కొండాపూర్ పంచాయతీ కార్యదర్శి పి. రాజేష్ గ్రామసభ వేదికగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి వ్యవసాయ డైరెక్టర్ న్యాలపట్ల కనకయ్య గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ హన్మాండ్ల యాదగిరి,ANM లు పద్మ, మంగ,కారోబార్ ముల్కల అంజయ్య, గ్రామ పెద్ద మనుషులు హనుమండ్ల నరసయ్య, న్యాలపట్ల రాజయ్య గౌడ్, రైతులు మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News