నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………………..అక్టోబర్ 31 న సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి అక్టోబర్ చివరి వారంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంలో మంగళవారం రోజున జగిత్యాల జిల్లా అధికారుల సమీకృత సముదాయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను సమీక్షా సమావేశం మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత అధ్యక్షత వహించి జిల్లా అధికారుల సిబ్బంది చే ప్రతిజ్ఞ చేయించారు.అక్రమాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని *జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత* తెలిపారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన మీటింగ్ హాల్ లో *జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత* విజిలెన్స్ వారోత్సవాలు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా *జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత మాట్లాడుతూ* మనందరం నైతికత పారదర్శకత మరియు సేవల పట్ల బాధ్యతగా పనిచేయాలని అవినీతి నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.అలాగే మన పనిలో నైతిక విలువలను పాటిస్తూ నిజాయితీకి ప్రాధాన్యమిస్తూ అప్రమత్తంగా ఉంటూ మన ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని కోరారు. మనందరం అవినీతికి వ్యతిరేకంగా పోరారని, కలిసి పనిచేయాలని ఉద్యోగులకు దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మనమంతా నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అదనపు కలెక్టర్ సూచించారు. అవినీతి అక్రమాల నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డి.డబ్ల్యూ.వో బోనగిరి నరేష్, బి.సి సంక్షేమ శాఖ అధికారిణి జి. సునీత, విజిలెన్స్ సి.ఐ ప్రశాంత్ రావు, డిప్యూటీ ఇంజనీర్ విజయ్ శేఖర్, ఏఈఈ సురేష్, కలెక్టరేట్ పరిపాలన అధికారి హకీమ్,విజిలెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





