Saturday, March 14, 2026

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డి ఎం హెచ్ వో.

నేటి సాక్షి, నల్లబెల్లి అక్టోబర్ 29 :నల్లబెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత రికార్డులను, మందులను పరిశీలించారు ఈ సందర్భంగా డీ ఎం హెచ్ వో సాంబశివ మాట్లాడుతూ నల్లబెల్లి వైద్యాధికారి డాక్టర్ ఆచార్య, సిబ్బందికి పలు సూచనలు చేశారు.ప్రస్తుత మొంథ తుఫాన్, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల ద్వారా విష జ్వరాలు తదితర రోగాల బారిన ప్రజలు పడే అవకాశం ఉందని, ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తంగా అందుబాటులో ఉండి ప్రజలకు సరైన వైద్యం చేయాలని , అదేవిధంగా మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు, ఏఎన్ఎంలు ఆశ వర్కర్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి జ్వర సంబంధమైన సర్వేలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆచార్య, నిఖిల, హెచ్ ఏ కృష్ణ, ఫార్మసిస్ట్ రంగారావు,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News