నేటి సాక్షి గన్నేరువరంబుర్ర అంజయ్య గౌడ్ గన్నేరువరం మండలంలో పోగొట్టుకున్న (CEiR) సి ఈ ఐ ఆర్, టెక్నాలజీతో ఫోన్ స్వాధీనం చేసుకొని తిరిగి బాధితునికి అప్పగించిన గన్నేరువరం ఎస్సై జి నరేందర్ రెడ్డి మరియు పిసి సాయి ప్రేమ్ గత కొన్ని రోజుల క్రితం ఆసరి పరుశరాములు తండ్రి లింగయ్య అనే వ్యక్తి గన్నవరం మండలంలో తమ ఫోను పోగొట్టుకున్నాడని ఫిర్యాదు చేయగా గన్నేరువరం పోలీస్ కానిస్టేబుల్ సాయి ప్రేమ్ ఆ ఫిర్యాదును స్వీకరించి, www, ceir, gov, in, అనే వెబ్సైట్లో ఫోన్ యొక్క, ఐ ఎం ఈ ఐ నెంబర్ ను ఎంటర్ చేసి బ్లాక్ చేశారు అట్టి ఫోన్ లో ఈ వెబ్సైట్ ద్వారా దొరికిన వ్యక్తి వివరాలతో కూడిన సమాచారం గన్నేరువరం పోలీసులకు చేరింది సమాచారం అందుకున్న పోలీసులు ఫోన్ దొరికిన వ్యక్తి నుండి ఫోన్ స్వాధీనం చేసుకొని పోగొట్టుకున్న బాధితునికి ఫోను అందజేయడం జరిగిందని ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు





