నేటి సాక్షి నారాయణపేట అక్టోబర్ 29, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ నెల 31న మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఆయా జిల్లాలోని డి ఈ ఓ కార్యాలయం ముందు తెలంగాణ మధ్యాహ్న భోజనం కార్మిక సంఘం ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి వెంకటేష్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నో ఆశలు చూపించి పని చేసుకున్న చరిత్ర తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ఆయన తెలిపారు. అధికార ప్రభుత్వం ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు పదివేల రూపాయలు చెల్లిస్తామంటూ వాగ్దానాలు చేసి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ ఒక్క రూపాయి కూడా చెల్లించ లేదన్నారు. తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు కోడిగుడ్ల బిల్లులు వంట సామాగ్రి తో పాటు యూనిఫామ్ లు అందజేయాలని ఆయన కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ధన్వాడ మండల ఎంఈఓ గాయత్రి మేడమ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇట్టి ఆందోళన కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాలు యువ నాయకులు సహకరించాలని కోరారు. 31న ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బందుకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మదన భోజన కార్మికులు కే లక్ష్మి సువర్ణ, అంజమ్మ, అనురాధ, షాహినా బేగం,తదితరులు పాల్గొన్నారు.





