Sunday, March 15, 2026

వర్షంలో రోడ్డు భద్రత కోసం కృషిచేసిన బిఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధి మారపంగు స్థానికులు ఆయన సేవా భవాన్నీ ప్రశంసిస్తూ..

నేటి సాక్షి మహబూబాబా ద్ నరసింహుల పేట (బి. ఆర్. నాయక్ ) అక్టోబర్ 29 మహబూబాబా ద్ జిల్లా నరసింహుల పేట మండలంలో ఎడతెరిపి వర్షం కురుస్తున్న వేళ ముంగిమడుగు నుండి నర్సింహులపేట ప్రధాన రహదారి పై కురుస్తున్న వేళ ఎలాంటి ప్రాణాలు నష్టం జరగకుండా ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్న బి ఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధి మారపంగు వీరన్న ప్రశంసలు అందుకున్నారు. వర్షపాతం కారణంగా రహదారిపై నీటి ప్రవాహం పెరిగి వాహనదారులకు ప్రమాదం సంభవించే అవకాశం ఉండడంతో వీరన్న ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేసి ప్రజలను సురక్షిత మార్గాల వైపు దారి మళ్ళించారు అలాగే ప్రజలకు వాహనదారులకు సౌకర్యం కలిగేలా సహాయం అందిస్తూ స్థానిక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న సోషల్ మీడియా ప్రతినిధి వీరన్న స్థానికుల అభినందనలు అందుకున్నా రు. వర్షం బురద పట్టించుకోకుండా ప్రజల కోసమే కష్టపడిన వీరన నిజమైన ప్రజాసేవకుడు అని అభిప్రాయపడ్డారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News