నేటి సాక్షి, నారాయణపేట, అక్టోబర్ 29, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ వర్షానికి చిత్తడే చిత్తడిగా మారింది. కురిసిన వర్షానికి ఆర్టీసీ బస్టాండు చిత్తడిగా మారి గుంతల మయంగా మారింది. వర్షం కురిస్తే చాలు మరికల్ ఆర్టీసీ బస్టాండ్ బురదమయంగా మారుతుందని పలు ప్రజాసంఘాల నాయకులు గతంలో పలుసార్లు ఆర్టీసీ అధికారులకు విన్నవించిన పలు ప్రజాసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి మరికల్ ఆర్టీసీ బస్టాండ్ లో మరమ్మత్తు పనులు చేపట్టాలని పలు ప్రజాసంఘాల నాయకులు అధికారులను కోరుతున్నారు.





