నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 29, నారాయణపేట జిల్లాలోనిమరికల్ మండలానికి నూతన ఎంపీడీవో గా వచ్చిన శ్రీ పృథ్వీరాజ్ గారిని ఈరోజు మరికల్ మండల పరిషత్ కార్యాలయంలో మండల విద్యాధికారి శ్రీ మిర్జా కలీముల్ల గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ సిబ్బంది శ్రీ హరి ప్రసాద్ ఐ ఈ ఆర్ పి కోఆర్డినేటర్ గారు, శ్రీ శివకుమార్, శ్రీమతి అరుణ సీఆర్పీలు మరియు శ్రీ ప్రవీణ్ కుమార్ ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ గారు పాల్గొనడం జరిగింది.





