Sunday, March 15, 2026

ఒక్కరే పోస్ట్ మాస్టర్ అధికారి ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలి ఎం నొంపల్లి గ్రామస్తుల వినతి….

నేటి సాక్షి, నారాయణపేట అక్టోబర్ 29,నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం యంనోనిపల్లి గ్రామంలో వృధ్యాప్య,వితంతు,వికలాంగుల పెన్షన్ లబ్దిదారులకు ఇద్దరు పోస్ట్ మ్యాన్ లా ద్వారా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇద్దరి ద్వారా పంపిణీ చేయడం వల్ల లబ్దిదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈయన ఒక రోజు ఆయన ఒక రోజు రావడం ద్వారా ప్రజలు పెన్షన్ కోసం వేచిచూడాలి. అలాగే మంచాల పైన ఉన్న వారికి కూడా వీళ్ళు ఇవ్వడం లేదు గ్రామ పంచాయితీ దగ్గరకే వచ్చి తీసుకోవాలని చెబుతున్నారు.లబ్దిదారుల కుటుంబ సభ్యులు ఆటోలల్లో తీసుకొని వెళ్లి ఇప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున మా గ్రామ ప్రజల తరుపున ప్రభుతాన్ని, జిల్లా కలెక్టర్, ఎంపీడీఓ గారిని వేడుకుంటున్నాము వెంటనే ఒక్కడే పోస్టుమాస్టర్ ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని ఈ రోజు పంచాయతీ కార్యదర్శి బాలస్వామి గారికి వినతిపత్రం ఇచ్చి కోరుతున్నాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News