*నేటి సాక్షి,గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ):* గన్నేరువరం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గన్నేరువరం ఎస్సై జి నరేందర్ రెడ్డి సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాగులు వంతెనలపై వరద ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. రెండు రోజులపాటు తుఫాన్ ప్రభావం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. యువత సెల్ఫీల కోసం పరివాహక ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దుని సూచించారు నీటి మునిగిన రహదారులను నిలిపివేస్తూ హెచ్చరిక బోర్డులు భారీ కేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు ఉంచమన్నారు. పిల్లలను ఇంటి నుంచి బయటకు రాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100, మరియు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై జి. నరేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





