నేటి సాక్షి,నారాయణపేట అక్టోబర్ 31, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో వాటర్ మేనంగా పనిచేస్తున్న టాకీ నరసింహ (35)అనే వ్యక్తి పనిచేస్తూ అనారోగ్యంతో గురువారం ధన్వాడ మండల కేంద్రంలో మృతి చెందడం జరిగింది. మృతి పట్ల ఐ టి యూ సి జిల్లా నాయకులు పి వెంకటేష్ సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో మృతి చెందిన నర్సింహ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతి చెందిన నర్సింహ కుటుంబంలోని ఒకరికి గ్రామపంచాయతీలో ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.





