Sunday, March 15, 2026

నేల వాలిన వరిచేలు…ఆందోళనలో రైతులు….. పత్తి పంటకు తీవ్ర నష్టం ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయాలి పంట పొలాలను పరిశీలించిన బిజెపి బృందం బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్..

నేటి సాక్షి పాలేరు , అక్టోబర్ 30:పంట చేతికి వచ్చే సమయంలో మొంథా తుఫాన్ ప్రభావంతో తుఫాను దాటికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్ డిమాండ్ చేశారు గురువారం మండల పరిధిలోని కాకరవాయి గ్రామానికి చెందిన రైతుల పంట పొలాలను బిజెపి బృందం పరిశీలించి ఈ సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్ మొంథా తుఫాన్ ప్రభావంతో మండలంలో వందలాది ఎకరాలు వరి పంట పాలు పోసి దశలో రాగానే తుపాన్ ప్రభావంతో వరి పంటలు నేల వాలినాయని గత బిఆర్ఎస్ ప్రభుత్వం నేడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పసల్ బీమా యోజన పథకం అమలు చేయకపోవడం చాలా విచారకరమని అదే పసల్ బీమా యోజన పథకం అమలు చేస్తే ప్రతి రైతుకు ఎకరాకు 30 నుండి 40 వేల రూపాయల అసలు భీమా యోజన పథకం వర్తించదని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పసల్ బీమా యోజన పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. మొంథా తుఫాన్ ప్రభావంతో మండలం లోని పలు గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అనేక ఎకరాల్లో వరి నేల వాలగా, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటి వరకు ఆశించినంత దిగుబడి రాకపోగా కొద్దోగొప్పో చేతికి అంగుతుందని అనుకునే సమయంలో తుఫాను దాటికి పత్తి చేలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ప్రతి ఎకరాకు నష్టం పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని బిజెపి బృందం డిమాండ్ చేసింది.. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్ నల్లగట్టు రాములు, కొమ్ము వెంకన్న ఊడుగుల వీరయ్య, నల్లగట్టు నవీన్, నల్లగట్టు వేణు ,వెంకటయ్య, దుర్గయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News