(నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 30:)*మామిడిపల్లికి బస్సు సౌకర్యం కల్పించి ఆడపడుచులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.బడంగ్ పేట కార్పొరేషన్ లో అతిపెద్ద గ్రామం మామిడిపల్లి. ప్రజలు నిత్యం పట్టణప్రాంతాలకు వెళ్లేందుకు సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. మహిళలు, విద్యార్థులు చిరు ఉద్యోగులు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి టెంపుల్ ఛైర్మన్ నరేష్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ ఛైర్మన్ విజయ్ గౌడ్, లాల్ సతీష్, జంగయ్య బృందం కేఎల్ఆర్ కు విజ్ఞప్తి చేశారు.ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగించి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను లక్ష్మారెడ్డి కోరారు. త్వరలోనే బస్సులు మామిడిపల్లికి వచ్చి ఆడపడుచులు, విద్యార్థులు, ఉద్యోగులకు కలుగుతున్న ఇబ్బందులు తొలుగుతాయని కిచ్చెన్న అన్నారు.ఇటీవలే ఆర్కేపురం డివిజన్ లో పలు కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించటంతో ఉచితంగా ప్రయాణిస్తున్నామని కేఎల్ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కిచ్చెన్నగారు మాట్లాడుతూ… బస్సు లేని ఊరు, కాలనీ లేకుండా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదిళ్ల నరేందర్, రాజ్ కుమార్, చీమలదారి చెన్నయ్య సహా పలువురు పాల్గొన్నారు.





