Sunday, March 15, 2026

నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి-సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి..

నేటిసాక్షి, మిర్యాలగూడ : ముంథా తుఫాన్ మరియు అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనిసిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలోని మాడుగులపల్లి మండలంలోని పలు గ్రామాలలో గురువారం రైతులతో కలిసి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, క్షేత్ర స్థాయిలో పర్యటించి, నష్టపోయిన పంటను అంచనా వేసి, ఎకరానికి రూ.30వేల నష్టపరిహారం వెంటనే ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం లో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దేవి రెడ్డి అశోక్ రెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, సిపిఎం మండల కమిటీ సభ్యులు జూకూరు నాగయ్య, పతాను శ్రీను, సిపిఎం కుక్కడం శాఖ కార్యదర్శి మునగాల నారాయణరెడ్డి, శాఖ సభ్యులు పండగ నాగయ్య, సీతారాం రెడ్డి రైతులు అలుగుబెల్లి గోవర్ధన్ రెడ్డి, షేక్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News