మన (నేటి సాక్షి)జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని 103 – బోరబండ డివిజన్ బాబా సైలానీ నగర్ లో బోరబండ డివిజన్ ఇంచార్జ్, బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ , మాగంటి సునీత గోపీనాథ్ మద్దతుగా వారి కుమార్తెలు దీక్షిత, అక్షిత లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. పేద ప్రజల బ్రతుకులకు భరోసానిచ్చిన పార్టీ బిఆర్ఎస్ అయితే, అబద్ధపు హామీలతో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజలకు మొండి “చెయ్యి” చూపిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కాబట్టి నవంబర్ 11న జరిగే ఎన్నికల్లో మన బ్రతుకులకు భరోసా నిచ్చిన బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ 3వ నెంబర్ పై ఓటు వేసి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





