Sunday, March 15, 2026

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు అన్ని వైద్య సేవలు ఉచితంగా చేయాలి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి: డాక్టర్. వెంకటరమణ.*డిడిసి కమిటీ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ**నంద్యాల, అక్టోబర్..

* నేటి సాక్షి:డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు అన్ని వైద్య సేవలు ఉచితంగా ఇవ్వాలనిజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ జిల్లాలో ఉన్న అన్ని నెట్వర్క్ ఆసుపత్రులకు సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చాంబర్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ స్కీం గురించి వైద్యాధికారులతో డిడిసి(జిల్లా డిసిఫ్లైనరీ కమిటీ) సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకటరమణ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం వైద్య అభివృద్ధికి అధిక నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు అన్ని వైద్య సేవలు ఉచితంగా చేయాలన్నారు.ఇకనుంచి ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగుల నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయరాదని అన్ని వైద్య సేవలు ఉచితంగా చేయాలన్నారు. అలా చేయని యెడల పదింతల వరకు అపరాధ రుసు విధించడం తోపాటు ఆసుపత్రి లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.ఏ ఆసుపత్రులు అయితే గ్రీవెన్స్ ఉన్నాయో ఆ ఆసుపత్రులకు అపరాధ రుసుం విధించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కన్సల్టేషన్ చార్జీలు, ఇన్వెస్టిగేషన్ కు, ఎమర్జెన్సీ సేవలు పూర్తి ఉచితంగా అందించాలన్నారు.ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ కింద పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించేటట్లు చూడాలని డిఎంహెచ్వోను కోరారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ ఓ.లలిత, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వై.రూపేంద్ర నాథ్ రెడ్డి, జిల్లా మేనేజర్ ఆర్ శ్రీధర్ గ్రీవెన్స్ ఉన్న నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు. —————////————–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News